అక్షరటుడే, కోటగిరి: Bodhan Sub-Collector | భూభారతిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. పోతంగల్ తహశీల్దార్ కార్యాలయాన్ని (Pothangal Tahsildar office) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతిలో (Bhubharati) వచ్చిన సాదాబైనామాలు, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను, మండలంలోని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో 499 దరఖాస్తులు వచ్చాయని, అందులో 130 సాదాబైనామాలు దరఖాస్తులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సుల (revenue conferences) ద్వారా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిందన్నారు.
భూభారతిలో వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహశీల్దార్ గంగాధర్‌కు సూచించారు. కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ అజీజ్, ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
