Homeజిల్లాలుకామారెడ్డిBhubarathi | భూభారతితో భూవివాదాలు పరిష్కారం

Bhubarathi | భూభారతితో భూవివాదాలు పరిష్కారం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ/నిజాంసాగర్‌:Bhubarathi | భూభారతితో రైతులకు సంబంధించి అన్ని భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(Collector Ashish Sangwan) అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంతోపాటు నిజాంసాగర్, మహ్మద్‌నగర్‌ మండలకేంద్రాల్లో నిర్వహించిన భూభారతి(Bhubarathi)పై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూహక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు ముందు భూముల సర్వే, పెండింగ్‌ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ చైర్మన్‌ మనోజ్‌కుమార్, కాంగ్రెస్‌ పార్టీ మహ్మద్‌ నగర్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ సవాయిసింగ్, ఏఓ నవ్య, బాన్సువాడ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, తహసీల్దార్‌ వరప్రసాద్, డీఎల్‌పీవో సత్యనారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.