అక్షరటుడే నిజాంసాగర్: Nagamadugu Lift Irrigation Scheme | మండలంలో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ నిర్మాణం కోసం భూసేకరణ కొనసాగుతోందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi) అన్నారు. పైప్‌లైన్ నిర్మాణం కోసం కొనసాగే భూసేకరణకు సంబంధించి శుక్రవారం నిజాంసాగర్ (Nizamsagar) మండల పరిషత్ కార్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
Nagamadugu Lift Irrigation Scheme | ధర పెంచితే బాగుంటుంది..
నాగమడుగు పైప్‌లైన్ నిర్మాణ పనుల కోసం మండలంలోని వడ్డేపల్లి (vaddepally) గ్రామ శివారులో 2.14 గుంటలు, జక్కాపూర్ (jakkapur) గ్రామ శివారులో 28 గుంటల భూమి అవసరం ఉందని సబ్‌కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం రైతుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు ఎకరాకు రూ.17లక్షలు గతంలో చెల్లించారని ప్రస్తుతం మార్కెట్‌కు అనుగుణంగా ధరను పెంచాలని రైతులు సబ్‌కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ భిక్షపతి, సర్వేయర్ శ్రీకాంత్, ఆర్ఐ సాయిలు, రైతులు సుభాష్ రెడ్డి, రవీందర్, పండరి తదితరులు పాల్గొన్నారు.