అక్షరటుడే, వెబ్డెస్క్ : Bihar Elections | బీహార్లో ఎన్డీఏ కూటమి జోరు కొనసాగుతోంది. ఆ కూటమి ఏకంగా 180కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మహఘట్బంధన్ (Mahaghat Bandhan) కూటమి బొక్క బోర్లా పడింది. ఆ కూటమి 50 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఒకప్పుడు బీహార్లో హవా నడిపించిన లాలు ప్రసాద్ కుటుంబం ఈ ఎన్నికల్లో ప్రభావం కోల్పోయింది. లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఇద్దరు కుమారులు వెనుకంజలో ఉన్నారు. ఎంజీబీ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సైతం వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆయన రఘోపూర్ నుంచి పోటీ చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీవ్కుమార్ ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి 106 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇక్కడ 30 రౌండ్లలో ఫలితం లేదనుంది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది.
Bihar Elections | తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం
లాల్ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav)ను ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సొంతంగా జనశక్తి జనతాదళ్(జెడీ)ను స్థాపించి పోటీలో నిలిచారు. అయితే ఆ పార్టీ ఎక్కడ కూడా ప్రభావం చూపలేదు. తేజ్ ప్రతాప్ యాదవ్ వైశాలి జిల్లాలోని మహువా నుంచి పోటీ చేయగా.. ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు 4,399 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ ఎల్జేపీ (రాంవిలాస్) అభ్యర్థి సంజయ్ కుమార్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
Bihar Elections | కాంగ్రెస్కు షాక్
బీహార్ ఓటర్లు కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. బీహార్లో తమ కూటమి గెలుపు కోసం రాహుల్ గాంధీ (Rahul Gandhi) జోరుగా ప్రచారం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రస్తుతం సింగిల్ డిజిట్ సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ పార్టీ ఏడు స్థానాల్లో లీడ్లో ఉంది. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీని బీహార్ ప్రజలు తిరస్కరించారు.
