అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar Politics | బీహార్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో (State politics) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (RJD chief Lalu Prasad Yadav) తన కుమారుడికే షాక్ ఇచ్చారు. తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను (former minister Tej Pratap Yadav) ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించాడు. అంతేగాకుండా కుటుంబం నుంచి ఆయనను దూరం పెట్టడం గమనార్హం. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లాలూ తెలిపారు.
Bihar Politics | కలకలం రేపిన ఫేస్బుక్ పోస్ట్
తేజ్‌ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) గతంలో మంత్రిగా పని చేశారు. ఆయనకు 2018లో ఐశ్వర్యరాయితో వివాహం అయింది (married Aishwarya Rai). ఆమె చంద్రిక రాయి కూతురు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్రాయి మనవరాలు. అయితే తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్‌లో ఒక మహిళతో 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవల పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ బీహార్ రాజకీయాల్లో (Bihar politics) తీవ్ర చర్చకు దారి తీసింది. విడాకులు తీసుకోకుండా మరో మహిళతో ప్రేమలో ఉన్నట్లు ఫొటో పెట్టడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పార్టీకీ నష్టం జరుగుతుందని భావించిన లాలూ ప్రసాద్‌యాదవ్ (Lalu Prasad Yadav) తన కుమారుడిపై వేటు వేశారు.
కాగా.. దీనిపై తేజ్‌ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ (Facebook account hacked) అయిందన్నారు. ఆ ఫొటోను కూడా ఎడిట్ చేశారని పేర్కొన్నారు. కాగా బీహార్‌లో ఈ ఏడాది చివరలో ఎన్నికలు ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి, ఆర్జేడీ (NDA alliance and RJD) మధ్య పోటీ నెలకొంది. చాలా ఏళ్లుగా అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్‌పై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది. దీనిని ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని ఆర్జేడీ చూస్తోంది. కాగా ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ పార్టీలు ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.