ePaper
More
    HomeజాతీయంLalu Prasad Yadav | లాలూ ప్ర‌సాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. విచార‌ణ‌పై స్టే విధించేందుకు నిరాక‌ర‌ణ‌

    Lalu Prasad Yadav | లాలూ ప్ర‌సాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. విచార‌ణ‌పై స్టే విధించేందుకు నిరాక‌ర‌ణ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు (Lalu Prasad Yadav) చుక్కెదురైంది. ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం(ల్యాండ్ ఫ‌ర్ జాబ్)పై ట్ర‌య‌ల్ కోర్టులో జ‌రుగుతున్న విచార‌ణ‌ను నిలిపివేయాల‌న్న లాలూ అభ్య‌ర్థ‌న‌ను న్యాయ‌స్థానం శుక్రవారం తోసిపుచ్చింది.

    సంచ‌ల‌నం సృష్టించిన కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేప‌ట్టి, ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో ట్రయల్ కోర్టు(Trail Court)లో జ‌రుగుతున్న‌ చర్యలను నిలిపి వేయాల‌ని లాలూ సుప్రీంను ఆశ్ర‌యించారు. అయితే, ఆయ‌న పిటిష‌న్‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తోసిపుచ్చింది. ఈ దశలో విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది.

    Lalu Prasad Yadav | రైల్వే నియామకాల్లో భారీ కుంభకోణం

    2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభ‌కోణం చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లోని భారత రైల్వేల పశ్చిమ సెంట్రల్ జోన్‌ (Indian Railways West Central Zone)లో గ్రూప్ డి నియామకాలలో జరిగిన భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి.

    రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించ‌డానికి గాను లాలూ కుటుంబం.. అభ్య‌ర్థుల నుంచి భూములు బ‌ద‌లాయించుకున్నారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. సంచ‌ల‌నం సృష్టించిన ఈ కుంభ‌కోణంపై సీబీఐ (CBI) కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టింది. దీనిపై ట్ర‌య‌ల్ కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంది. అయితే, సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ లాలూ హైకోర్టులో పిటిష‌న్ పెండింగ్‌లో ఉంది.

    Lalu Prasad Yadav | వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు

    ఈ క్ర‌మంలోనే ట్ర‌య‌ల్ కోర్టు చ‌ర్య‌ల‌ను నిలిపి వేయాల‌ని ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ద‌శ‌లో జోక్యం చేసుకోలేమ‌న్న స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. పెండింగ్ పిటిషన్‌(Pending Pitition)పై విచారణను వేగవంతం చేయాలని జస్టిస్ ఎంఎం సుంద్రేష్. ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.

    హైకోర్టు ముందు జరుగుతున్న విచారణలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు(Delhi High Court) ఇప్పటివరకు చేసిన ఏవైనా వ్యాఖ్యలు కేసు మెరిట్లను ప్రభావితం చేయవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ట్రయల్ కోర్టులో లాలూ యాదవ్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...