Lakshman Rathod Award | లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డు

విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది.

అక్షరటుడే, గాంధారి : Lakshman Rathod Award | విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది. న్యూఢిల్లీకి చెందిన గ్యాన్ ఉదయ్ ఫౌండేషన్ (Gyan Uday Foundation) ఆధ్వర్యంలో అవార్డును ఆయనకు అందజేసింది. ఈ మేరకు ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు.

Lakshman Rathod Award | గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధి కోసం..

మారుమూల గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి లక్ష్మణ్​ రాథోడ్​ బామన్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ (Bauman Sports Foundation) ఏర్పాటు చేసి సేవలందింస్తున్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యమే కాకుండా ఉన్నత స్థాయిలో ఉద్యోగం కూడా సంపాదించవచ్చని ఆయన క్రీడాకారులకు ఎల్లప్పుడూ సూచిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న వారి సేవలను సర్వే చేసి తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు లక్ష్మణ్​ రాథోడ్​ తెలిపారు. 17 ఏళ్లుగా తాను మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో (Government School) చదువుతున్న విదార్థులను క్రీడల్లో మెళుకువలు నేర్పిస్తున్నాన్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. శ్రేష్ట్ భారత్ సంస్థ (Shresht Bharat Institute) వారు సైతం వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు.

Lakshman Rathod Award | మరిన్ని శిక్షణ శిబిరాలు ఏర్పాటు..

దేశ, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్లు, బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రోద్బలంతో క్రీడల అభివృద్ధికి పాటు పడుతున్నట్లు లక్ష్మణ్​ రాథోడ్​ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధికి మరిన్ని శిక్షణ శిబిరాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. గ్రామీణ క్రీడాకారులు పుట్టుకతో శారీరక దృఢత్వం కలిగి ఉండడం వల్ల అత్యున్నత స్థాయి శిక్షణ ఇస్తే అంతర్జాతీయస్థాయి (International Level) ఎదుగుతారన్నారు. పేద పిల్లలకు సాయం చేయడం గర్వంగా ఉందని, ఈ అవార్డు రావడం వల్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా నుంచి ప్రతి అవార్డును వారు పోస్ట్ ద్వారానే అందిస్తున్నారని సంస్థ డైరెక్టర్​ నగేశ్ సూచించినట్లు ఆయన చెప్పారు. లక్ష్మణ్ రాథోడ్ అవార్డు రావడంపై ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రన్ గుగ్లోత్ సురేందర్, ఎస్జీఫ్ సెక్రెటరీ హీరాలాల్, మాజీ జెడ్పీటీసీ శంకర్ నాయక్ తదితరులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Related articles

Kamareddy Education Demand | కామారెడ్డిలో విద్యాసంస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టండి.. విద్యార్థి సంఘాల సూచన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Mudhiraj Mahasabha Appointment | రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ ఇన్​ఛార్జీగా మంత్రి గణేష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.

AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది