ePaper
More
    Homeక్రీడలుLuke Hollman | ల‌గాన్ షాట్‌ని దింపేశాడుగా.. ఈ షాట్ చూస్తే ప‌డిప‌డి న‌వ్వుకుంటారు..!

    Luke Hollman | ల‌గాన్ షాట్‌ని దింపేశాడుగా.. ఈ షాట్ చూస్తే ప‌డిప‌డి న‌వ్వుకుంటారు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Luke Hollman | ఇంగ్లాండ్‌(England)లో జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ 2025 టీ20 లీగ్‌లో మిడిలెసెక్స్ ఆటగాడు ల్యూక్ హాల్మన్ (Luke Hollman) ఆడిన ఓ ప్రత్యేకమైన షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాట్‌కి పేరు పెట్టలేక ఫన్నీగా స్పందిస్తున్నారు.

    “ఇదేమి షాట్ రా అయ్యా? రివర్స్ స్కూప్ అనాలా, రివర్స్ స్విచ్ అనాలా?” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మిడిలెసెక్స్ – స‌ర్రే మధ్య జరిగిన మ్యాచ్‌లో, 19వ ఓవర్‌లో సామ్ కరన్ వేసిన బంతిని హాల్మన్ అసాధారణంగా ఫోర్‌గా మలచాడు. ముందుగా రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు స్టాన్స్ మార్చుకున్న హాల్మన్, సామ్ కరన్ వేసిన స్లో, లూపీ డెలివరీను గమనించి.. వెంటనే పోసిషన్‌ను మారుస్తూ, బంతిని స్లిప్ ఫీల్డర్‌(Slip Fielder)పైగా చొప్పించి బౌండరీ కొట్టాడు.

    Luke Hollman | ఈ షాటేదో బాగుందిగా..

    ఇది చూసిన వారంతా అతని చాకచక్యం, టైమింగ్, ట్రిక్కీ షాట్ అంటూ ఆయ‌న ప్లాన్‌ని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ, “ఇది లగాన్‌లో ఆమీర్ ఖాన్ కొట్టిన‌ షాట్‌లా ఉంది”, “ఇది క్రికెట్‌కో న్యూ స్టైల్”, “బ్రెయిన్ అండ్ స్కిల్ కలిసిన మాస్టర్‌పీస్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. సర్రే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 189/9 పరుగులు చేసింది. విల్ జాక్స్ 36 బంతుల్లో 52 ప‌రుగులు చేయ‌గా, టామ్ కరన్ 22 బంతుల్లో 47 ప‌రుగులు చేశాడు. మిడిలెసెక్స్ 20 ఓవర్లలో 181/6తో పరిమితమై 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ల్యూక్ హాల్మన్ 14 బంతుల్లో 32 నాటౌట్ (5 ఫోర్లు, 1 సిక్స్) ప‌రుగులు చేశాడు.

    ఇక హాల్మన్ సూపర్ షాట్‌(Hollmans Super Shot)తో పాటు బౌలింగ్‌లోనూ మెరిశాడు. 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 34 పరుగులిచ్చాడు. అయితే అతని అద్భుత ఆల్‌రౌండ‌ర్  ప్రదర్శన జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో రాయన్ హిగిన్స్(Rayan Higgins) కూడా ఆకట్టుకొని 4 వికెట్లు తీసి, 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ వీడియోతో పాటు హాల్మన్ షాట్ ఇప్పుడు వైరల్‌గా మారి నెటిజన్ల మన్ననలు పొందుతుంది. అభిమానుల మాటల్లో చెప్పాలంటే, “క్రికెట్‌లో కొత్తగా చూడాల్సిన షాట్ వచ్చేసింది!” అంటూ ఈ షాట్‌ని తెగ వైర‌ల్ చేస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...