అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | డ్రగ్స్‌తో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఓ డాక్టరే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయింది. హైదరాబాద్ hyderabad లోని ఓ హాస్పిటల్లో కీలక స్థానంలో పని చేసే డాక్టర్ నమ్రత డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ముంబయికి చెందిన వంశ్ టక్కర్‌కు రూ.5 లక్షలు ఆన్లైన్ ద్వారా పంపి 53 గ్రాముల కొకైన్‌ను ఆమె ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు 53 గ్రాముల కొకైన్ డెలివరీ తీసుకుంటుండగా షేక్‌పేట్‌లోని ఆమె అపార్ట్మెంట్లో పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్‌తో పాటు డెలివరీ బాయ్ బాలకృష్ణను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. కాగా ఆమె భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం డ్రగ్స్ అలవాటు పడ్డట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలు కోసం నాలుగేళ్లలో ఆమె రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Hyderabad | డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన లేడీ డాక్టర్
6
previous post