Homeజిల్లాలుకామారెడ్డిMla Venkata Ramana reddy | వినాయక మండపాలకు లడ్డూలను అందజేయనున్న ఎమ్మెల్యే కేవీఆర్​..

Mla Venkata Ramana reddy | వినాయక మండపాలకు లడ్డూలను అందజేయనున్న ఎమ్మెల్యే కేవీఆర్​..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Mla Venkata Ramana reddy | వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఊరువాడ సంబరాలు తీసుకువచ్చింది. పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామన పండపాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే వినాయక విగ్రహాల వద్ద ప్రతి మండపంలో లడ్డూను ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల చివరి రోజు ఈ లడ్డూలను వేలం వేస్తారనే విషయం తెలిసిందే. బాలాపూర్​ లడ్డూ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. ప్రతియేటా ఈ లడ్డూ ధర రికార్డులు సృష్టిస్తుంటుంది. కాగా.. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు (Vinayaka chavithi) ప్రతి యేటా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి లడ్డూల పంపిణీ చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ యేడు కూడా పంపిణీ చేయనున్నారు.

Mla Venkata Ramana reddy | ఈ ఏడాది సైతం..

వినాయక చవితి సందర్భంగా లడ్డూలను పంపిణీ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. లడ్డూల తయారీ సైతం పూర్తి చేయించారు. కాగా.. వీటిని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఫొటోతో ఉన్న బాక్సుల్లో ప్యాకింగ్​ చేవారు. ఈ మేరకు బుధవారం రాత్రి అన్ని వినాయక మండపాలకు ఈ అందజేయనున్నారు.