Homeజిల్లాలుకామారెడ్డిGanesh Laddu | గణేశ్​ మండపాల వద్ద లడ్డూ వేలంపాటలు.. ఉత్సాహంగా పాల్గొంటున్న భక్తులు

Ganesh Laddu | గణేశ్​ మండపాల వద్ద లడ్డూ వేలంపాటలు.. ఉత్సాహంగా పాల్గొంటున్న భక్తులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Ganesh Laddu | ఉమ్మడిజిల్లాలో వినాయక నిమజ్జనాలు (Vinayaka nimajjanam) భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండపాలల్లో లడ్డూలను వేలం వేస్తుండగా.. భక్తులు ఉత్సాహంగా వేలంపాటల్లో పాల్గొంటున్నారు. లడ్డూలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వేలంలో లడ్డు దక్కించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

Ganesh Laddu | నగరంలోని అశోక టౌన్​షిప్​లో..​

నగరంలోని బైపాస్​ రోడ్​లోని అశోక టౌన్​షిప్​లో (Ashoka Township) వినాయక చవితి సందర్భంగా (Vinayaka chavithi) బొజ్జగణపయ్యను ప్రతిష్ఠించారు. శనివారం నిమజ్జనం సందర్భంగా మండపంలో లడ్డూను వేలం వేశారు. ఈ వేలంలో లడ్డూను టౌన్​షిప్​లోని వసంత్​రెడ్డి (ప్లాట్​ నం.408) రూ.2,09,000కు దక్కించుకున్నారు. ఆయనకు టౌన్​షిప్​ కమిటీ ప్రతినిధులు, అపార్ట్​మెంట్​ వాసులు అభినందనలు తెలిపారు.

Ganesh Laddu | రామారెడ్డి మండలం రెడ్డిపేట్​లో..

రామారెడ్డి(ramareddy) మండలం రెడ్డిపేట స్కూల్ తండాలో (Reddypet school Thanda) గణేశుని వద్ద పూజలందుకున్న లడ్డూను శనివారం వేలం వేశారు. తండాకు చెందిన సలావత్ దేవు లడ్డును రూ.50,111కు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా తండావాసులు దేవును అభినందించారు.

Must Read
Related News