అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళికా విభాగం (town planning department) అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. ఎక్కడ అక్రమ కట్టడాలు (illegal constructions) చేపట్టినా, అనుముతులు లేకుండా నిర్మాణాలు జరిగినా వీరే అడ్డుకట్ట వేయాలి.
ముఖ్యంగా భవిష్యత్తులో జనాభా అవసరాల దృష్ట్యా పట్టణం లేదా నగరాన్ని అభివృద్ధి చేయడంలో వీరి ప్రణాళిక అత్యంత కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల పనితీరు విమర్శలకు తావిస్తోంది. పలుచోట్ల సిబ్బంది కొరతతో విభాగం నామమాత్రంగా మారింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో (Nizamabad Municipal Corporation) పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలున్నాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తొమ్మిది గ్రామాల విలీనం తర్వాత డివిజన్ల సంఖ్య 60కి పెరిగింది. పునర్విభజనకు ముందు 50 డివిజన్లకు కేటాయించిన క్యాడర్ స్ట్రెంత్ ఇప్పటికీ అలానే ఉంది. పరిధి విస్తరించిన క్రమంలో నిర్మాణాలు, ఆక్రమణల గుర్తింపునకు పట్టణ ప్రణాళిక విభాగంలో పోస్టులు పెంచాలి. కానీ, ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావడంతో 81 వేలకు పైగా నివాస, వాణిజ్య సముదాయాలు ఉన్న నగరంలో పర్యవేక్షణ సాధ్యమవడం లేదు.
నగరంలో నిత్యం పదుల సంఖ్యలో కొత్త ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తుంటాయి. అలాగే అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు, కబ్జాలపై విచారణలు చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా అధికారులు, సిబ్బంది లేరు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే టౌన్ ప్లానింగ్, టీపీబీవోలు ఇలా ఏడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు (town planning supervisors) ఆరుగురికి గాను కేవలం ఇద్దరే ఉన్నారు.
Bheemgal | అంతటా అదే తీరు..
బోధన్ పట్టణంలో (Bodhan Town) 8 పోస్టులకు ఇద్దరే పని చేస్తున్నారు. ఆర్మూర్ టీపీఎస్‌కు భీమ్‌గల్‌లో ఇనఛార్జి బాధ్యతలు ఇచ్చారు. ఆయన అక్కడ ఒక్క రోజు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. బాన్సువాడలో ఒకరోజు పనిచేస్తున్నారు. మెదక్ మున్సిపాలిటీ టీపీఎస్ (Medak Municipality TPS) ఎల్లారెడ్డిలో వారానికి ఒకరోజు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డిలో పట్టణ ప్రణాళిక విభాగంలో ఆరుగురు ఉద్యోగులకు కేవలం ఇద్దరే ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో ఏడు గ్రామాలు విలీనమై.. 49 వార్డులకు పెరిగాయి. పరిధి పెరిగినా సిబ్బంది లేక పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పుతోంది.
Bheemgal | పురపాలిక ఇళ్లు వార్డులు పోస్టులు విధుల్లో ఉన్నవారు
- నిజామాబాద్ 81,000 60 19 04
- బోధన్ 18,500 38 06 04
- ఆర్మూర్ 22,780 36 04 02
- భీమ్‌గల్ 5,960 12 0 0
- కామారెడ్డి 26,949 49 06 02
- బాన్సువాడ 10,260 19 0 0
- ఎల్లారెడ్డి 5,490 12 0 0
Bheemgal | అధికారిక పనుల్లో బిజీ..
అన్ని మున్సిపాల్టీలలో నిత్యం ప్రజల నుంచి భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు వస్తూనే ఉంటాయి. కాగా ఆయా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులివ్వాల్సి ఉంటుంది. బల్దియాలో నెలలో 20 నుంచి 50 భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తులు వస్తుంటాయి. ప్రభుత్వ జాగాల్లో (government lands) అక్రమ నిర్మాణాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులు విచారించాల్సి ఉంటుంది.
డిజిటల్ సర్వే, నాలాలు, చెరువుల ఆక్రమణల గుర్తింపు విధులను సైతం వీరికే కేటాయించారు. నెలల తరబడి నాళాలు చెరువుల వెంట తిరుగుతూ.. ఆక్రమణలు గుర్తించారు. ఆ సమయంలో మున్సిపల్‌కు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉన్న కొద్దిమంది వేర్వేరు పనులు అప్పగించడంతో వాటికే బిజీగా అవుతున్నారు.
Bheemgal | కానరాని ఎన్‌ఫోర్స్‌మెంట్
టీఎస్‌బీపాస్ (TSB PASS) అమల్లోకి వచ్చాక కీలక మార్పులు జరిగాయి. 2021 నుంచి భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలకు స్థానిక తహశీల్దార్ నేతఅత్వంలో టీపీవో, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖ ఏఈ, అగ్నిమాపకశాఖ అధికారి సభ్యులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బఅందాలను ఏర్పాటు చేశారు. వివిధ శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ బఅందం సమన్వయంతో పనిచేయాలి. వచ్చిన ఫిర్యాదులతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం ఫిర్యాదులను సైతం క్షేత్రస్థాయిలో విచారించి అక్రమ నిర్మాణాలను ఆపాలి. కానీ, ఆయా శాఖల అధికారులు తమ తమ విధుల్లో బిజీగా మారుతున్నారు. కొందరైతే ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.