అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారుల (forest and revenue officials) మధ్య సమన్వయ లోపంతో కొంతమంది రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. మండల (Gandhari Mandal) కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పోడుభూముల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Gandhari Mandal | సంయుక్తంగా సర్వే నిర్వహించాలి..
రాష్ట్రంలో రెవెనోయూ, ఫారెస్ట్ అధికారులు సమన్వయంగా సర్వే నిర్వహించిన పోడు భూముల రైతులకు న్యాయం చేయాలని కోదండ రెడ్డి సూచించారు. త్వరలోనే అర్హులైన వారికి పోడు భూమి పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇటీవల సీఎంతో మాట్లాడినప్పుడు సైతం పోడురైతుల (podu farmers) సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.
Gandhari Mandal | అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు..
పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రతి మండలంలో అసైన్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కోదండ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ప్రక్షాళన కూడా జరిగిందని అర్హులు పాస్‌పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
Gandhari Mandal | వ్యవసాయ మార్కెట్ కమిటీ సందర్శన
అనంతరం ఆయన గాంధారి మార్కెట్ కమిటీని సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పోడు భూములకు సంబంధించి రుణాలు ఇవ్వట్లేదని రైతులు కోదండ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. సోయా కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రైతుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం సుమారు రూ.1,05,000 కోట్ల ఆర్థికసాయం చేసిందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ మెంబర్లు గడుగు గంగాధర్, రాము నాయక్, రామ్ రెడ్డి, నరసింహారెడ్డి, మరికంటి భవాని, సునీల్ కుమార్, వెంకన్న యాదవ్, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.