HomeతెలంగాణACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కార్మిక శాఖ అధికారిణి

ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కార్మిక శాఖ అధికారిణి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | రాష్ట్రంలో ఏసీబీ అధికారులు (ACB Officers) దూకుడు పెంచారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాడులు అవినీతి అధికారులను పట్టుకున్నారు. ప్రజల్లో కూడా అవగాహన పెరడగంతో ఏసీబీకి ఫిర్యాదులు పెరిగాయి. దీంతో ఏసీబీ అవినీతి అధికారుల పని పడుతోంది. తాజాగా శుక్రవారం ఒక్క రోజే నాలుగు ప్రాంతాల్లో దాడులు చేసింది. ముగ్గురు అధికారులు, ఒక ప్రైవేట్​ వ్యక్తిని అరెస్ట్​ చేసింది.

ACB Raid | డెత్​ క్లెయిమ్​ కోసం..

అవినీతి అధికారులు ఏ పనికైనా లంచం అడుగుతున్నారు. ఓ కార్మికుడు చనిపోతే అతనికి రావాల్సిన డబ్బులు ఇప్పించడానికి కూడా లంచం తీసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాల (Mancherial) జిల్లా బెల్లంపల్లి సహాయ కార్మిక కార్యాలయం అసిస్టెంట్​ లేబర్​ ఆఫీసర్​గా పాకా సుకన్య పని చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఇటీవల మరణించాడు. కార్మిక శాఖ నుంచి రావాల్సిన డెత్​ క్లెయిమ్​, అంత్యక్రియల ఖర్చు కోసం మృతుడి భార్య దరఖాస్తు చేసుకుంది.

ఆ దరఖాస్తును పరిశీలించి ఉన్నతాధికారులకు పంపడానికి అసిస్టెంట్​ లేబర్​ ఆఫీసర్ (Assistant Labor Officer)​ రూ.30 వేల లంచం డిమాండ్​ చేసింది. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చింది. శుక్రవారం రూ.30 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు అసిస్టెంట్​ లేబర్​ ఆఫీసర్​ సుకన్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె లంచాలు తీసుకోవడం కోసం కార్యాలయంలో ప్రైవేట్​ సహాయకురాలిగా మోకినేపల్లి రాజేశ్వరి అనే మహిళను నియమించుకుంది. ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు.

మంచిర్యాల జిల్లా అసిస్టెంట్​ లేబర్​ ఆఫీసర్ (Assistant Labor Officer) కాటం రామ్మోహన్​ కూడా ఇలాంటి క్లెయిమ్​ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఒకే జిల్లాలో ఇద్దరు అసిస్టెంట్​ లేబర్​ ఆఫీసర్లు ఏసీబీకి చిక్కడంతో కార్మిక శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది.

ACB Raid | మున్సిపల్​ ఆఫీసులో సోదాలు

ఏసీబీ అధికారులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు వల పన్ని అధికారులను పట్టుకుంటున్నారు. అంతేగాకుండా అవినీతి, అక్రమాలు అధికంగా జరుగుతున్న శాఖలు, కార్యాలయాలపై తాజాగా ఫోకస్​ పెట్టారు. అలాంటి కార్యాలయాపై ఆకస్మికంగా దాడులు (Surprice check) చేస్తున్నారు. గురువారం రాష్ట్రంలోని మూడు సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో (SRO) దాడులు చేసిన అధికారులు.. శుక్రవారం ఓ మున్సిపల్ కార్యాలయంలో సోదాలు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ (Palvancha Municipality)లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా లెక్కల్లో చూపని రూ.40765 నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు రిజిస్టర్లలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. రికార్డుల నిర్వహణ సైతం సక్రమంగా లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అధికారులు తెలిపారు.