అక్షరటుడే, కామారెడ్డి: Labana Samaj | లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని లబానా సమాజ్ కాయితి లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని (Delhi) కేంద్ర గిరిజన శాఖ (Central Tribal Affairs Department) కమిషనర్ నిరుపమ్ చక్మా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Minister Kishan reddy), ఎంపీ ఈటల రాజేందర్లను మంగళవారం కలిశారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ లబానా సమాజ్ కాయితి లంబాడీల (Labana Samaj Kaity Lambadis) నాయకులు శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లబానా లంబాడీల సమస్యలను వారికి వివరించారు. గతంలో చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించి లబానా సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో లబానా సమాజ్ నాయకులు దశరత్ నాయక్, నర్సింగ్, బోథ్ మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నారాయణ్ సింగ్, బద్ధు, రాంసింగ్, జమున భామన్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.