అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kyathanpalli municipal chairperson | మంచిర్యాల జిల్లా (Mancherial District) క్యాతన్‌పల్లిలో మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం రెండో సారి మున్సిపల్ ఛైర్పర్సన్ (Municipal Chairperson) ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఎన్నిక వాయిదా వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం పట్టణంలో బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ బంద్‌తో క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. బంద్‌కు సీపీఐ సైతం మద్దతు తెలిపింది. దీంతో ఆ రెండు పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
Kyathanpalli municipal chairperson | బాల్క సుమన్‌పై కేసు
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు (BRS Ledaer) బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం మంత్రి వివేక్ (Minister Vivek) కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. బాల్క సుమన్ తనపై దాడి చేశాడని మంత్రి పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు రాళ్లదాడిలో పాల్గొన్న పలువురిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. క్యాతన్పల్లితోపాటు ఖానాపూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో కౌన్సిలర్లను ఆయా పార్టీల నేతలు క్యాంపులకు తరలించారు.
Kyathanpalli municipal chairperson | ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు (High Court) స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఫలితాలు వెలువడిన వెంటనే తనను బలవంతంగా చీరాల తీసుకెళ్లారని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. బలవంతంగా రిసార్టులోనే రెండు రోజులు ఉంచారని చెప్పారు. ఈ నెల 16న హైదరాబాద్ (Hyderabad)లో 12 గంటల పాటు తిప్పారని, హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్‌కు హాజరయ్యానని తెలిపారు.