అక్షరటుడే, వెబ్‌డెస్క్: kurnool crime : ప్రభుత్వ ఉద్యోగం కోసం తహతహలాడిన ఓ కొడుకు.. తన తండ్రిని హతమార్చడం కర్నూలు Kurnool జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
కోడుమూరు Kodumur మండలంలోని పులకుర్తి Pulakurthi గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన.. బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.
పులకుర్తికి చెందిన రామాచారి కుమారుడు వీరసాయి, డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం కర్నూలులో ఓ ఫార్మసీ దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే చిన్ననాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ చాలా ఉంది.
కాగా, కొన్ని నెలల క్రితం తన తండ్రి సహోద్యోగి (డ్రైవరు) విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు.
దీంతో ఆ డ్రైవరు కొడుకుకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం government job వచ్చింది. ఈ ఘటన వీరసాయికి కుటిల ఆలోచనకు బీజం వేసింది.
kurnool crime : ఉద్యోగం కోసం..
“తండ్రి చనిపోతే నాకు ఉద్యోగం Job వస్తుందేమో” అనే భ్రమలో వీరసాయి మానవత్వాన్ని మరిచి, అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.
నెల రోజుల క్రితం భార్య సుప్రియ రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లగా.. రెండు రోజుల క్రితం తల్లి విరూపాక్షమ్మ కూడా తన పుట్టిల్లు చిన్నతుంబలం వెళ్లారు.
దీంతో ఇంట్లో తండ్రీ-కొడుకులే ఉన్నారు. మంగళవారం (సెప్టెంబరు 2) రాత్రి, తండ్రి రామాచారితో కలిసి భోజనం చేశాడు వీరసాయి.
అనంతరం తండ్రి నిద్రలోకి జారుకున్న తర్వాత ఇంట్లో ఉన్న రోకలి బండతో తలపై కసిగా దాడి చేసి ప్రాణాలు తీశాడు వీరసాయి.
తెల్లవారేసరికి రక్తపు మడుగులో రామాచారి మృతదేహాన్ని చూసిన స్థానికులు షాక్‌కు గురై, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు వీరసాయిని Veerasai అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతండ్రినే హతమార్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం అనే ఆశ ఒక వ్యక్తి మానవత్వం కోల్పోయేలా ఏ స్థాయికి తీసుకెళ్లిందో తెలియజేస్తుంది.
తండ్రిని హత్య చేసిన కొడుకు అన్న వార్త పల్లెల్లోని ప్రతి ఇంటిలో చర్చనీయాంశంగా మారింది. సమాజంలో విలువలు ఎలా తగ్గిపోతున్నాయో ఈ ఘటన మరొకసారి నిరూపించింది.