Homeఆంధప్రదేశ్Kurnool Bus Accident | కర్నూల్​ బస్సు ప్రమాదం.. పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Kurnool Bus Accident | కర్నూల్​ బస్సు ప్రమాదం.. పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కర్నూల్​ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందించాలని నిర్ణయించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kurnool Bus Accident | కర్నూల్​లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది.

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు (Vemuri Kaveri Travels) చెందిన వోల్వో బస్సు కర్నూల్​ జిల్లా చిన్నటేకూరు సమీపంలో కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడారు. తాజాగా ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Kurnool Bus Accident | ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్​

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణా శాఖా మంత్రులు, అధికారులతో ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల వివరాలు గుర్తించి తక్షణ సాయం అందించాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్​నెస్, సేఫ్టీపై తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణం అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.