అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kurnool Bus Accident | కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం అయ్యారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) కర్నూల్ జిల్లా చిన్నటేకూర్ సమీపంలో దగ్ధం అయిన విషయం విధితమే. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్ మండలం (Kurnool Mandal) ప్రజానగర్‌కు చెందిన శివశంకర్ బైక్‌పై రాంగ్రూట్లో రావడం, బస్సు దానిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్ బస్సు కిందకు దూసుకుపోవడంతో మంటలు చెలరేగి 20 మంది చనిపోయారు. ఈ ఘటనలో బైక్ మీదున్న శివశంకర్ సైతం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడు.
Kurnool Bus Accident | అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్
ప్రమాదానికి ముందు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ (Petrol Bunk)లోకి వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రాత్రి 2:23 గంటలకు శివశంకర్ మరో వ్యక్తితో కలిసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో కొద్ది సేపు అటు ఇటు తిరిగాడు. అయితే ఆ సమయంలో ఆయన మద్యం తాగి ఉన్నట్లు వీడియోలో చూస్తే అర్థం అవుతోంది. అంతేగాకుండా పెట్రోల్ బంక్ నుంచి వెళ్లే సమయంలో సైతం ఆయన బైక్‌ను అతివేగంగా నడిపాడు. దీంతో స్కిడ్ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్న మరో వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన లేరు.
Man responsible for Kurnool bus accident.
Clearly, he is out of control.
Licenses of such undisciplined youths should be revoked.
— India Flick (@IndiaFlick) October 25, 2025
