అక్షరటుడే, వెబ్‌డెస్క్:Indian Student | అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన నెవార్క్ విమానాశ్రయం(Newark Airport)లో ఊహించని చోటుచేసుకుంది.భారత దేశానికి చెందిన ఒక యువకుడిని అక్కడి భద్రతా సిబ్బంది నేలపై పడేసి, అతని చేతులను వెనక్కి విరిచి బేడీలు వేయడం అందరిని కలిచి వేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ‘ఎక్స్’ మాధ్యమంలో కునాల్ జైన్ Kunal Jain అనే సామాజిక వ్యాపారవేత్త (సోషల్ ఆంత్రప్రెన్యూర్) పంచుకున్నారు.ఆయన భారత ఎంబసీ(Indian Embassy)తో పాటు, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(Minister S. Jaishankar)ను ట్యాగ్ చేశారు. ఈ దారుణాన్ని కునాల్ జైన్ అనే భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పంచుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.
Indian Student | దారుణాతి దారుణం..
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికా వచ్చిన ఆ విద్యార్థిని Student చేతులకు బేడీలు వేసి, నేలపై పడేసి, కన్నీరుమున్నీరవుతున్నా కనికరించకుండా బలవంతంగా వెనక్కి పంపించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్‌లోని భారత రాయబారి కార్యాలయం (కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా),తమకు ఈ ఘటనపై సమాచారం అందిందని,ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. జూన్ 7న జరిగినట్లుగా చెప్పబడుతున్న ఈ ఘటన వివరాలను కునాల్ జైన్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరు ‘తీవ్ర అమానుషం’ అని, ఇది ఒక ‘మానవ విషాదం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ యువ విద్యార్థి నేరస్థుడిలా చూడబడ్డాడు. కలలు సాకారం చేసుకునేందుకు అమెరికా(America) వచ్చాడు కానీ, హాని చేయడానికి కాదు. ఒక ఎన్నారైగా, నేను నిస్సహాయంగా చూస్తుండిపోయాను… గుండె పగిలినట్లు భావించాను” అని జైన్ తన పోస్టులో పేర్కొన్నారు. బాధితుడు హర్యానాకు చెందినవాడై ఉండొచ్చని,ఎందుకంటే అతడు హరియాణ్వీ భాషలో మాట్లాడుతున్నాడని కునాల్ వెల్లడించారు. ఈఘటనపై భారతీయ రాయబార కార్యాలయంతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. బాధిత విద్యార్థి హర్యానా Haryana యాసలో మాట్లాడుతున్నట్లు అనిపించిందని, ఇటీవల కాలంలో చాలా మంది భారతీయ విద్యార్థులు, పర్యాటకులు తమ ప్రయాణ ఉద్దేశాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు సరిగ్గా వివరించలేకపోవడం వల్లే ఇలాంటి తిరస్కరణలు ఎదురవుతున్నారని జైన్ ఆందోళన వ్యక్తం చేశారు.