Kummera Mallanna Jatara | కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతి.. కాంగ్రెస్​ నాయకులు దాడి చేశారని ఆరోపణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kummera Mallanna Jatara | నాగర్​ కర్నూల్​ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా సాగుతోంది. ఈ క్రమంలో స్వామి వారి దర్శనం కోసం గ్రామానికి చెందిన గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, బంధువు చంద్రకళతో కలిసి వెళ్లారు. బుధవారం రాత్రి లైన్​లో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kummera Mallanna Jatara | నాగర్​ కర్నూల్​ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా సాగుతోంది. ఈ క్రమంలో స్వామి వారి దర్శనం కోసం గ్రామానికి చెందిన గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, బంధువు చంద్రకళతో కలిసి వెళ్లారు. బుధవారం రాత్రి లైన్​లో ఉండగా.. టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, చంద్రకళకు మధ్య వివాదం మొదలైంది. దీంతో తోపులాట చోటు చేసుకోగా.. మౌనిక తన చిన్నారితో సహా కిందపడిపోయింది. ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం చిన్నారి మృతి చెందింది. దీంతో కాంగ్రెస్​ నాయకుల తీరుతోనే తమ కుమార్తె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

Kummera Mallanna Jatara | పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కుమ్మెర మల్లన స్వామి జాతరలో చిన్నారి మృతిపై బీఆర్​ఎస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ నేతలు చిన్నారిని హత్య చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి (Marri Janardhan Reddy) ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. నాగర్ కర్నూల్ నుంచి సంఘటన జరిగిన కుమ్మెర గ్రామానికి పాదయాత్రగా వెళ్లారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే అని ఆయన ఆరోపించారు.

Kummera Mallanna Jatara | ఖండించిన కవిత

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పామని తెలిపారు. దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. పసి పాప మృతికి కారణమైన వారి పై BNS 106(1), BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆమె నాగర్​ కర్నూల్​ ఎస్పీతో ఫోన్​లో మాట్లాడారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy College Land Dispute | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర...

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

​అక్షరటుడే, భీమ్​గల్ : Vemula Prashanth Reddy Protest | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Projects Completion | రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth...

NSUI Sandeep Challenge | సమయం ఖరారు చేసి చెప్పాలి..: ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం...