Homeక్రీడలుKuldeep Yadav | ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్.. మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి...

Kuldeep Yadav | ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్.. మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి 173/2

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట పూర్తిగా కుల్దీప్ యాదవ్‌ ఆధిపత్యంలో సాగింది. రెండో రోజు ఒక వికెట్‌ తీసిన కుల్దీప్‌, మూడో రోజు ఆరంభం నుంచే విండీస్‌ బ్యాటర్లపై తన స్పిన్ మాయాజాలం ప్రారంభించాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kuldeep Yadav | వెస్టిండీస్‌తో West Indies జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుతమైన బౌలింగ్‌తో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి టెస్ట్‌ కెరీర్‌లో ఐదోసారి ఫైవ్‌ వికెట్ హాల్ నమోదు చేసాడు కుల్దీప్. వెస్టిండీస్ (West Indies) మొదటి ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, గతంలో జానీ వార్డ్‌లే పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు సమం చేశాడు. దీంతో 64 ఏళ్ల ప్ర‌పంచ రికార్డ్ స‌మం చేసిన‌ట్టైంది.

Kuldeep Yadav | కుల్దీప్ రికార్డ్..

జానీ వార్డ్‌లే తన కెరీర్‌లో ఈ ఘనతను 5 సార్లు సాధించాడు కాని, ఈ రికార్డ్‌ని 28 టెస్ట్ మ్యాచ్‌లలో పూర్తి చేశాడు. అదే కుల్దీప్ యాదవ్ కేవలం 15 టెస్ట్ మ్యాచ్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఈ రికార్డ్ ప్రయాణం కుల్దీప్‌ను టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ ఎడమచేతి రిస్ట్ స్పిన్నర్లలో ఒకరిగా నిలబెడుతోంది. ఇక వెస్టిండీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ పతనానికి ప్రధాన కారణం కుల్దీప్ (Kuldeep Yadav) స్పిన్ మాయాజాలమే. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజా 3 వికెట్లు, బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో భారత జట్టు ఇప్పటికే 270 పరుగుల ఆధిక్యం దక్కించుకుని మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఈ క్ర‌మంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫాలోఆన్ ఆడించ‌డం గమనార్హం.

అయితే ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్ జ‌ట్టు నిల‌క‌డ ఆట‌తో భార‌త బౌల‌ర్స్ కి స‌వాల్ విసురుతుంది. చంద్ర‌పాల్‌(10) సిరాజ్ బౌలింగ్‌లో త్వ‌ర‌గానే ఔట్ కాగా, ఆ త‌ర్వాత అలిక్(7) ప‌రుగులు చేసి వాషింగ్ట‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. అయితే మ‌రో ఓపెన‌ర్ క్యాంప్‌బెల్ (87 నాటౌట్), షై హోప్ Shai Hope ( 66 నాటౌట్) నిల‌క‌డ‌గా ఆడుతూ భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వెస్టిండీస్ జ‌ట్టు రెండు వికెట్లు కోల్పోయి 173 ప‌రుగులు చేసింది