అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kuldeep Yadav | సొంత గడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాకు పర్యటనకు సిద్దమైంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. బుధవారం భారత జట్టు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనుంది.
ఈ సిరీస్‌తో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నారు. ఐపీఎల్ తర్వాత తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న వీరు ఎలా ఆడతారో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సిరీస్‌కు ముందు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మని తప్పించి శుభ్‌మన్ గిల్ కు అప్పగించారు.
Kuldeep Yadav | కుల్దీప్‌పై వేటు..
వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ప్రకారం, ఈ కెప్టెన్సీ మార్పు వన్డే ప్రపంచకప్ 2027 కోసం తీసుకున్నముందస్తు నిర్ణయం. అయితే కోహ్లీ, రోహిత్ (Rohit Sharma)ఈ సిరీస్‌లో ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు, రవి శాస్త్రి వంటి వారు అభిప్రాయపడ్డారు. పెర్త్ వేదికగా అక్టోబర్ 19న మొదటి వన్డే జరుగనుండగా, వికెట్ పూర్తిగా పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రధాన పేసర్లు, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ జట్టుకి ఆడతారు . నాలుగో పేసర్ కావాలంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)జట్టులోకి చేరతారు.లేదంటే అతనిపై వేటు తప్పదు.
బ్యాటింగ్ కాంబినేషన్‌లో రోహిత్ శర్మ ,శుభ్‌మన్ గిల్ ఓపెనర్స్‌గా బరిలోకి దిగుతారు, విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)నాలుగో స్థానంలో, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో, బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షిత్ రాణా 8వ స్థానంలో ఆడతాడు.
భారత వన్డే తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్/ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా .
వన్డే షెడ్యూల్:
తొలి వన్డే : అక్టోబర్ 19, పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే : అక్టోబర్ 23, అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే : అక్టోబర్ 25, సిడ్నీ, ఉదయం 9 గంటలకు