ePaper
More
    HomeతెలంగాణMinister Seethakka | కేటీఆర్‌కు సిస్ట‌ర్ స్ట్రోక్‌.. ఆయనకు మెద‌డు చితికింది.. మంత్రి సీతక్క విమ‌ర్శ‌లు

    Minister Seethakka | కేటీఆర్‌కు సిస్ట‌ర్ స్ట్రోక్‌.. ఆయనకు మెద‌డు చితికింది.. మంత్రి సీతక్క విమ‌ర్శ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Seethakka | కాంగ్రెస్‌(Congress)పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసిన బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీత‌క్క తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ఆయ‌న‌కు సిస్ట‌ర్ స్ట్రోక్ త‌గిలింద‌ని, దాంతో చిన్న మెద‌డు చితికింద‌ని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణ స‌మ‌యంలో క‌మీష‌న్లు తీసుకున్నప్పుడు లేని భ‌యం.. క‌మిష‌న్ ముందుకు రావ‌డానికి ఎందుకు అని ఆమె నిల‌దీశారు. గోబెల్స్ ప్ర‌చారంలో కేటీఆర్‌(KTR)ను మించిన వారెవ‌రూ లేర‌ని ఆయ‌న‌కు గ్లోబ‌ల్ అవార్డు ఇవ్వొచ్చ‌ని ఎద్దేవా చేశారు.

    Minister Seethakka | కేసీఆర్ చెప్పిన దెయ్యం కేటీఆరేన‌మో?

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసిన లేఖ‌తో పాటు చేసిన వ్యాఖ్య‌లు బీఆర్ఎస్‌(BRS)లో సంక్షోభాన్ని వెల్ల‌డిస్తున్నాయ‌ని సీత‌క్క తెలిపారు. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్(KCR) చుట్టూ దెయ్యాలు చేరాయ‌న్న కవిత వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన సీత‌క్క‌.. కవిత అన్న దెయ్యం కేటీఆరే కావొచ్చంటూ అనుమానం వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌‌కు లేదని తెలిపారు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు.

    Minister Seethakka | నిజాయితీ నిరూపించుకోండి..

    ప్రధాని మోదీ(Prime Minister Modi) ప్రశంసల కోసమే.. ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని సీత‌క్క విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారని తెలిపారు. యుద్ధంలో ట్రంప్ నీతిని మోదీ అమలు చేస్తున్నారన్నారు. అబద్ధాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారని ఆరోపించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్‌(KTR)కు నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్పా? అని కేటీఆర్‌ను నిలదీశారు. గులాబీ కూలీల రూపంలో దోచుకున్న డబ్బు ఎక్కడిదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    More like this

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...