Homeతాజావార్తలుKTR | కాంగ్రెస్​పై కేటీఆర్​ తీవ్ర విమర్శలు.. స్టార్​ క్యాంపెయినర్​గా దానం నియామకంపై ఆగ్రహం

KTR | కాంగ్రెస్​పై కేటీఆర్​ తీవ్ర విమర్శలు.. స్టార్​ క్యాంపెయినర్​గా దానం నియామకంపై ఆగ్రహం

దానం నాగేందర్​ను​ జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​గా నియమించడంపై కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్​కు ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | కాంగ్రెస్​ పార్టీ (Congress Party)పై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్ల లిస్ట్​లో దానం నాగేందర్​ పేరు ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖైరతాబాద్ (Khairatabad) ఇబ్రహీం నగర్​లోని బస్తీ దవాఖానను కేటీఆర్ మంగళవారం పరిశీలించారు. ఆస్పత్రిలోని వసతులపై ఆరా తీశారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. తమకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని బస్తీ దవాఖాన ఉద్యోగులు కేటీఆర్​కు తెలిపారు. అనంతరం కేటీఆర్​ (KTR) మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన దానం నాగేందర్​ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్​లో ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు.

 KTR | ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ

దానం నాగేందర్ (Danam Nagender) ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారని కేటీఆర్​ ప్రశ్నించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ అని విమర్శించారు. తమ పార్టీలో గెలిచినోళ్లను తీసుకొని, వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో పెట్టారన్నారు. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీకి నీతి, రీతి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్లో (BRS) గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి కరప్షన్​కు పాల్పడిందని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. బస్తీ దవాఖానా, అంగన్ వాడీ సిబ్బందికి వేతనాలు చెల్లించాలన్నారు.

 KTR | ఆస్పత్రులపై అధ్యయనానికి కమిటీ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్​ తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య నేతృత్వంలో కల్వకుంట్ల సంజయ్, మెతకు ఆనంద్ ఆధ్వర్యంలో కమిటీని కమిటీ రాష్ట్రంలోని ఆస్పత్రులను సందర్శిస్తుందని చెప్పారు. అక్కడి పరిస్థితులపై కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన తెలిపారు.