ePaper
More
    HomeతెలంగాణMinister Seethakka | సొంత చెల్లెనే కేటీఆర్​ను నాయకుడిగా గుర్తించడం లేదు.. మంత్రి సీతక్క సంచలన...

    Minister Seethakka | సొంత చెల్లెనే కేటీఆర్​ను నాయకుడిగా గుర్తించడం లేదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Seethakka | మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka) మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (BRS Working President KTR)​పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రైతు సంక్షేమం, ఉద్యోగాల భర్తీపై కేసీఆర్​, కేటీఆర్​ చర్చకు రావాలని శుక్రవారం జరిగిన సభలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్న విషయం తెలిసిందే.దీనికి శనివారం ఉదయం కేటీఆర్ కౌంటర్​ ఇచ్చారు. తాము చర్చకు సిద్ధమని ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్​క్లబ్ (Somajiguda Press Club)​లో చర్చకు రావాలని ఆయన సవాల్​ విసిరారు. ఈ క్రమంలో కేటీఆర్​ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు.

    అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్​రెడ్డి సవాల్​ చేస్తే ప్రెస్​క్లబ్​కు రమ్మనడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. సీఎం సవాల్‌ కేటీఆర్‌కు అర్థం కానట్టుందని పేర్కొన్నారు. సొంత చెల్లెలే కేటీఆర్​ను నాయకుడిగా గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాట్లాడుతూ.. కేసీఆర్​ నాయకత్వాన్ని తప్ప ఇతరుల నాయకత్వాన్ని ఒప్పుకోమని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి సీతక్క కేటీఆర్​పై సెటైర్లు వేశారు. డెడ్‌ అయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR)​ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. సమస్యలపై చర్చిద్దామంటే భయమెందుకన్నారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...