ePaper
More
    HomeతెలంగాణLegal Notice | బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసు

    Legal Notice | బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Legal Notice | కేంద్ర మంత్రి బండి సంజయ్​కు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ లీగల్ నోటీసులు పంపించారు. రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ అంశంపై సిట్​ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్​ ఎదుట ఇటీవల బండి సంజయ్​ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్​పై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తనకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్​(KTR) అప్పుడే ఎక్స్​ వేదికగా స్పందించారు. క్షమాపణ చెప్పకపోతే లీగల్​ నోటీసులు(Legal Notice) పంపిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా నోటీసులు పంపారు.ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసమే బండి సంజయ్​(Bandi Sanjay) ఆరోపణలు చేశారన్నారు. తనకు క్షమాపణ చెప్పాలని లీగల్​ నోటీసుల్లో పేర్కొన్నారు.

    Legal Notice | సిట్​ దూకుడు

    రాష్ట్రంలో బీఆర్​ఎస్ హయాంలో ఫోన్​ ట్యాపింగ్​ జరిగినట్లు సిట్​ అధికారులు(Sit Officers) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్​ దూకుడు పెంచింది. నిందితులను విచారించడంతో పాటు ఫోన్​ ట్యాపింగ్​(Phone Tapping)కు గురైన బాధితుల నుంచి స్టేట్​మెంట్​ రికార్డు చేస్తోంది. ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావును అరెస్ట్​ చేయడానికి చూస్తోంది. ఆయనను అరెస్ట్​ చేయకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    Legal Notice | బండి సంజయ్​ ఆరోపణలతో

    ఫోన్​ ట్యాపింగ్​ అంశంపై బండి సంజయ్​ ఇటీవల చేసిన ఆరోపణలతో రాజకీయ రచ్చ మొదలైంది. బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు, కేసీఆర్​ కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్​ చేశారని ఆయన ఆరోపించారు. సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్​ చేసి బ్లాక్​మెయిల్ చేశారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​పై ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ నేతలు(BRS Leaders) ఖండించారు. తాజాగా కేటీఆర్​ లీగల్​ నోటీసులు పంపారు. అయితే నోటీసులపై కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...