Homeతాజావార్తలుBandi Sanjay | మాగంటి గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్​ కుట్రలు : బండి సంజయ్​

Bandi Sanjay | మాగంటి గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్​ కుట్రలు : బండి సంజయ్​

మాగంటి గోపినాథ్​ ఆస్తులను కాజేయడానికి బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ కుట్ర పన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఆరోపించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్​లో ప్రచారం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సునీత, కేటీఆర్​ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం, ఆస్తులపై విచారణ జరపడం లేదన్నారు.

గోపీనాథ్​ (Maganti Gopinath) మృతిపై ఇటీవల ఆయన తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్​ ఉప ఎన్నికల్లో భాగంగా పలు కాలనీల్లో ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే ఆస్తులపై ఆయన భార్య సునీతతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. గోపీనాథ్​ ఆస్తులు కాజేసేందుకు బీఆర్​ఎస్​ (BRS) యత్నిస్తోందని ఆరోపించారు. మాగంటి సునీత పేరు మీద రెండు ఓటరు కార్డులు ఉన్నాయన్నారు. ఒకదాంట్లో భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని, మరో దాంట్లో మాగంటి గోపీనాథ్ అని ఉందని చెప్పారు. ఆ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నానని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తన కుమారుడిని చూడనీయకుండా గోపీనాథ్​ తల్లిని కేటీఆర్​ (KTR) అడ్డుకున్నారన్నారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యంతో నోటీసులు ఇప్పించారని ఆయన ఆరోపించారు. గోపీనాథ్​ మొదటి భార్య కుమారుడు అంత్యక్రియలకు రాకుండా.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బెదిరించారన్నారు.

Bandi Sanjay | రేవంత్​రెడ్డి సైతం..

గోపీనాథ్​ ఆస్తులను కాజేయడానికి కేటీఆర్​తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కుట్ర పన్నారని బండి సంజయ్​ విమర్శించారు. అందుకే ఆయన మృతిపై విచారణ జరపడం లేదన్నారు. గోపీనాథ్​ను చూడటానికి తల్లిని అనుమతించలేదన్నారు. అదే ఆస్పత్రిలో మాజీ మంత్రి కేటీఆర్, మాగంటి సునీత తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెర తీశారన్నారు. జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో (Jubilee Hills Elections) బీఆర్​ఎస్​ను గెలిపిస్తే ప్రజల ఆస్తులను కాజేస్తుందన్నారు. 20 శాతం ముస్లింల కోసం పాకులాడుతున్న బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు హిందువుల ఓటు బలం చూపించాలని ఆయన కోరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Must Read
Related News