అక్షరటుడే, లింగంపేట: KTR | మండల కేంద్రంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (YellaReddy Ex MLA Jajala Surender) హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం లింగంపేటకు (Linngampet) కేటీఆర్ రానున్న నేపథ్యంలో ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. లింగంపేటలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, సాయిలు, నర్సింలు, కపిల్ రెడ్డి, లక్ష్మన్, సర్వన్, రూప్ సింగ్, గను నాయక్, మల్లయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.
KTR | బాన్సువాడలో..
అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తాడ్కోల్ చౌరస్తాలో (Tadkol Couwrastha) మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, సాయిబాబా, బోడ చందర్, గాండ్ల కృష్ణ, శివ సూరి, చాకలి మహేష్, చాకలి సాయిలు, రాము, శంకర్, సంజయ్ యాదవ్, పోల్కం గోపాల్, సంజీవ్, సంగోజిపేట్ రాజు, నర్సింలు, జావీద్, సమీర్, గౌస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
KTR | పోతంగల్ మండల కేంద్రంలో..
అక్షరటుడే, కోటగిరి: మండల కేంద్రంలో (Kotagiri) బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం పూల మొక్కలు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు సూదం నవీన్ మాట్లాడుతూ.. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆరిఫ్, ఎజాజ్, గంగాధర్, సాయిలు, ఆంజనేయులు, సాయిలు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో కేటీఆర్ జన్మదినోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
కోటగిరిలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా మొక్కలను పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు