అక్షరటుడే, ఎల్లారెడ్డి: నియోజకవర్గంలోని లింగంపేటలో (Lingampet) బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆత్మగౌరవ గర్జన సభ (Aathmagourava garjana sabha) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS State Working President) కేటీఆర్ హాజరు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంటకు లింగంపేట్‌కు చేరుకుని ఆత్మగౌరవ గర్జన సభలో పాల్గొంటారు. 2 గంటలకు దళిత నాయకుడు ముదాం సాయిలు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలోని బాన్సువాడ మున్సిపల్(Banswada Municipality) మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్ కూతురి ఇంటికి, అక్కడి నుంచి బయలుదేరి 2.30 గంటలకు నాగిరెడ్డిపేట్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.