Homeతాజావార్తలుMaganti Gopinath | నా కొడుకు మరణానికి కేటీఆర్​ సమాధానం చెప్పాలి : మాగంటి గోపినాథ్​...

Maganti Gopinath | నా కొడుకు మరణానికి కేటీఆర్​ సమాధానం చెప్పాలి : మాగంటి గోపినాథ్​ తల్లి

మాగంటి గోపినాథ్​ మృతిపై ఆయన తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి మరణంపై కేటీఆర్​ సమాధానం చెప్పాలన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maganti Gopinath | జూబ్లీహిల్స్​ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాగంటి గోపినాథ్​ కుటుంబంలో (Maganti Gopinath Family) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోపినాథ్​ మొదటి భార్య కుమారుడు ఇటీవల ఫ్యామిటీ మెంబర్​ సర్టిఫికెట్​పై తహశీల్దార్​కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గోపినాథ్​ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాగంటి గోపినాథ్​ జూన్​ 8న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గోపినాథ్​ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు ఆస్పత్రిలో ఉండగా.. తనను చూడనివ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి చావుకు కేటీఆర్ (KTR) సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్​ చేశారు. మూడు రోజులు తన కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడన్నారు. కన్నతల్లి అయిన తననుచూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందే చనిపోతే కేటీఆర్​ వచ్చే వరకు ఆపారా అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు.

తన కుమారుడు ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న విషయం కూడా తనకు ఇతరులు చెప్తే తెలిసిందన్నారు. ఆస్పత్రిలో తన కుమారుడిని చూసే అవకాశం కల్పించాలని కేటీఆర్​ను కోరినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్తే కన్న తల్లి అయిన తనను కొడుకు వద్దకు వెళ్లనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ వచ్చి వెళ్లాక ఆయన చనిపోయాడని ప్రకటించడం వెనుక ఏం జరిగిందో కేటీఆర్ మాత్రమే చెప్పాలని గోపినాథ్ తల్లి (Gopinath mother) డిమాండ్ చేశారు.

Maganti Gopinath | కొంత మంది బెదిరించారు

మాగంటి గోపినాథ్​ అంత్యక్రియలకు ఆయన మొదటి భార్య, ఆమె కుమారుడు హాజరు కాలేదు. అంత్యక్రియలకు హజరు కాకుండా కొంత మంది రాజకీయ నేతలు తమను బెదిరించారని ప్రద్యూమ్నా ఆరోపించారు. శేరి లింగంపల్లి తహశీల్దార్​ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​పై (family member certificate) విచారణ జరిగింది. ఫిర్యాదుదారులు మాలని దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్‌తోపాటు.. మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి హాజరయ్యారు. సునీత తరఫున ఆమె కుమార్తె దీశిరా, లాయర్ వచ్చారు. ఇరుపక్షాల నుంచి తహసీల్దార్ స్టేట్​మెంట్​ను తహశీల్దార్​ రికార్డు చేశారు.