HomeతెలంగాణKTR | సీఎం రేవంత్​రెడ్డి మూటల మనిషి.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR | సీఎం రేవంత్​రెడ్డి మూటల మనిషి.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy )పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR)​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్​రెడ్డి మాటల మనిషి.. మూటల మనిషి అని ఆయన వ్యాఖ్యానించారు. గద్వాలకు చెందిన పలువురు కాంగ్రెస్​ నాయకులు సోమవారం బీఆర్​ఎస్​లో చేరారు. వారికి కేటీఆర్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అబద్ధాలే నచ్చుతాయని రేవంత్ అన్నారని పేర్కొన్నారు. ఎన్నిరోజులు కాంగ్రెస్‌(Congress)ను భరించాలని ప్రజలంటున్నారని కేటీఆర్​ అన్నారు. నిందలు, దందాలు, చందాలు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరని ఆయన ఆరోపించారు. రేవంత్​రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

KTR | వారికి బుద్ధి చెప్పాలి

సీఎం మానసికస్థితిపై అనుమానం కలుగుతోందని కేటీఆర్​ అన్నారు. ఓవైపు రాష్ట్రం దివాలా తీసిందని అంటూ.. మరోవైపు తెలంగాణ రైజింగ్‌(Telangana Rising) అంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్​లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్​ కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై నిందలు వేయడం, కాంట్రాక్టర్ల దగ్గర దందాలు చేయడం, ఢిల్లీకి చందాలు పంపడంతోనే.. రాష్ట్రాన్ని నడుపుతోందని విమర్శించారు.