Homeతాజావార్తలుBandi Sanjay | కేటీఆర్, రాహుల్ గాంధీలు ఐరన్ లెగ్​లు : బండి సంజయ్​

Bandi Sanjay | కేటీఆర్, రాహుల్ గాంధీలు ఐరన్ లెగ్​లు : బండి సంజయ్​

కేటీఆర్​ బీఆర్​ఎస్​కు ఐరన్​ లెగ్​గా మారారని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. ఆయన వర్కింగ్​ ప్రెసిడెంట్​ అయినప్పటి నుంచి ఆ పార్టీ అనేక ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay | బీహార్​లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం, జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Union Minister Bandi Sanjay) మాట్లాడారు. జూబ్లీహిల్స్​లో (Jubilee Hills) గెలిచింది ఎంఐఎం అభ్యర్థి అన్నారు.

రాష్ట్రంలో హిందూ సమాజం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ (BRS party) ప్రతిపక్ష నేత ఎవరు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రధాన ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోయిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో రాహుల్​ గాంధీ, రాష్ట్రంలో కేటీఆర్​ (Rahul Gandhi and KTR) ఐరన్​ లెగ్​లు అని బండి సంజయ్​ విమర్శించారు. వారే తమ బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. కేటీఆర్ 2018లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మెజారిటీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సొంత సోదరి కవిత నిజామాబాద్‌లో (Nizamabad) ఓటమి చెందారన్నారు.

2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) 99 నుంచి 56 స్థానాలకు పడిపోయిందని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓటమి పాలైందని తెలిపారు. 2024-25 ఎమ్మెల్సీల ఎన్నికల్లో సైతం బీఆర్​ఎస్​ ఓడిపోయిందని గుర్తు చేశారు. దుబ్బాక, హుజురాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓటమి చెందిందన్నారు. మునుగోడులో మాత్రమే గెలిచిందన్నారు.

Bandi Sanjay | రేపు బెంగాల్​లో..

బీహార్​లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిందని, పశ్చిమ బెంగాల్‌లో సైతం బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో స్వాతహాగా బీజేపీ 92 స్థానాల్లో విజయం సాధించిందని చెప్పారు. అక్కడ కాంగ్రెస్ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పని అయిపోయిందని.. ఇక ఆయన పబ్జి ఆడుకోవాలంటూ చురకలు అంటించారు.

Must Read
Related News