KTR on Mallanna Jathara | దైవ దర్శనానికి వెళ్తే దాడి చేస్తారా : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో కుల వివక్ష కారణంగా దాడి చేయడం, ఆ ఘటనలో రెండు నెలల చిన్నారి మృతి చెందడంపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా గ్రామానికి చెందిన గణేశ్​, మౌనిక దంపతులు తమ రెండు నెలల కుమార్తెతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో కుల వివక్ష కారణంగా దాడి చేయడం, ఆ ఘటనలో రెండు నెలల చిన్నారి మృతి చెందడంపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు.

కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా గ్రామానికి చెందిన గణేశ్​, మౌనిక దంపతులు తమ రెండు నెలల కుమార్తెతో కలిసి దర్శనానికి వచ్చారు. దర్శనం లైన్​లో వారితో ఆలయ నిర్వాహకులు గొడవకు దిగారు. అనంతరం మౌనికను తోసివేయగా.. ఆమె కూతురు తీవ్రంగా గాయపడి చనిపోయింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేటీఆర్​ మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల అహంకారంతో పసిపాప ప్రాణాలు తీశారన్నారు. దైవ దర్శనానికి వెళ్లిన వారిపై కులం పేరుతో దాడి చేయడమే కాకుండా.. వారిపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు.

KTR on Mallanna Jathara | అధికార పార్టీకి అండగా పోలీసులు

రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కేటీఆర్  (KTR)​ మండిపడ్డారు. పసికందు మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేశారు. హంతకుడు ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా శిక్షించాల్సిందే అన్నారు. రెండు నెలల పసిపాపను హత్య చేసిన ఎనిమిది మందిని హత్యానేరం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. 21వ శతాబ్దంలో కూడా కులాలు, మతాలంటూ అవమానించడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి బీఆర్ఎస్ (BRS) తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేసి, రూ.10 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Assistant Professors Terminated | మెడికల్ కళాశాలలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ

నగరంలోని మెడికల్ కళాశాలలో ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్​ కొరడా ఝలిపించింది. ఈ సందర్భంగా ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

Basara IIIT Student | బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​...

Medical Students Ground Demand | క్రీడామైదానం కోసం జూడాల డిమాండ్​.. జీజీహెచ్​లో నిరసన​

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Medical Students Ground Demand | శాశ్వత క్రీడామైదానం ఏర్పాటు చేయాలని జూనియర్​ డాక్టర్లు (JUDA Protest) డిమాండ్​ చేశారు....

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...