అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR municipal election comments | మున్సిపల్ ఎన్నికల (municipal election ) ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో తాము మెరుగైన ఫలితాలు సాధించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 2020లో 130 మేయర్లకు, చైర్ పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ (BRS) 122 గెలిస్తే, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 గెలిచిందని గుర్తు చేశారు. ఈరోజు వెలువడిన ఫలితాల్లో ఇప్పటికే ప్రత్యక్షంగా 15 పైనే గెలువబోతున్నామన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరో 15 చోట్ల తమ పార్టీకి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఓవరాల్గా మంచి ఫలితాలు వచ్చినట్లు భావిస్తున్నామని చెప్పారు.
KTR municipal election comments | సీపీఐకి మద్దతు
కొత్తగూడెం మున్సిపాలిటీ (Kothagudem Municipality)లో సీపీఐకి మద్దతు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై అడ్డుకట్ట వేయాలంటే సీపీఐతో కలిసి రావాలని కొత్తగూడెం ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టడానికే ఈ ఆఫర్ తాము వాళ్లకి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 750 వార్డులు గెలిచిందన్నారు. 30 శాతానికి పైగా సీట్లు తమకు వచ్చాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని ఆ మాత్రం సీట్లు గెలిచిందన్నారు.
KTR municipal election comments | అధికార దుర్వినియోగం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి విజయం సాధించిందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టడంతో కేతన్పల్లి మున్సిపాలిటీలో సీపీఐ తమతో కలిసి వచ్చిందన్నారు. దీంతో అక్కడ గెలిచినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఆయన ఆరోపించారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని పోతామన్నారు. మంచి భవిష్యత్ ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం అని చెప్పారు. ఇదే ఊపుతో రేపు GHMC ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
1 comment
[…] […]
Comments are closed.