Homeతాజావార్తలుKishan Reddy | కేటీఆర్ కలలు కంటున్నారు.. కిషన్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy | కేటీఆర్ కలలు కంటున్నారు.. కిషన్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటమి భయం పట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. అందుకే ఓ వర్గం ఓట్ల కోసం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishan Reddy | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు (Jubilee Hills by-Elections) సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Union Minister Kishan Reddy) సోమవారం మీడియా చిట్​చాట్​లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ (BRS) పని అయిపోయిందని, అది ఫామ్ హౌస్ పార్టీ అని కిషన్​రెడ్డి అన్ఆనరు. కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని కేటీఆర్ (KTR) కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా కేసీఆర్​ ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు.

Kishan Reddy | కాంగ్రెస్​కు ఓటమి భయం

కాంగ్రెస్​కు ఓటమి భయం పట్టుకుందని కిషన్​రెడ్డి అన్నారు. అందుకే ఓ వర్గం ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే అజారుద్దీన్‌కు మంత్రపదవి ఇచ్చారని చెప్పారు. అది బీజేపీకి ప్లస్​ అవుతుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ ఎన్నికలకి పాకిస్థాన్​కి ముడి పెట్టడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు తప్ప ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదన్నారు. రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని హితవు పలికారు.

Kishan Reddy | బీజేపీకి మంచి స్పందన

జూబ్లీహిల్స్‌లో బీజేపీకి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. తాము ఎలాంటి సర్వేలు చేయలేదని స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు, సానుభూతి పరులు బీజేపీ (BJP)కి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉందన్నారు. మెట్రోకు సంబంధించి కేంద్రానికి ఏ ప్రతిపాదన రాలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం టేకోవర్ చేసిన కొత్త డీపీఆర్​ కూడా పంపలేదని చెప్పారు.