అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై దాడి జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరా తీశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
Yellareddy | ఎస్పీకి ఫోన్…
అనంతరం ఎస్పీ రాజేష్ చంద్రకు (SP Rajesh Chandra) స్వయంగా ఫోన్ చేశారు. ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై గెలిచిన సర్పంచ్ అభ్యర్థి అమానుషంగా దాడి చేసిన ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు రక్షణగా నిలవాలని.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Yellareddy | అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..
ఈ సందర్భంగా జాజాల సురేందర్‌తో (Jajala Surender) కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలుసుకుని బాధితులకు అండగా ఉండాలని సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.