HomeతెలంగాణJaggareddy | కేటీఆర్​కు క్యారెక్టర్​ లేదు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy | కేటీఆర్​కు క్యారెక్టర్​ లేదు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jaggareddy | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jagga Reddy) ఫైర్​ అయ్యారు. కేటీఆర్​కు క్యారెక్టర్​ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్​ ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడుతూ కాంగ్రెస్​పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ చిల్లర పార్టీ అని, థర్డ్​ గ్రేడ్ పార్టీ(Third Grade Party) అని విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ఆయన ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్​​ పార్టీ(Congress Party)పై కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు మంత్రులు ఖండించారు. తాజాగా జగ్గారెడ్డి కేటీఆర్​పై నిప్పులు చెరిగారు.

Jaggareddy | కేసీఆర్​ కూడా థర్డ్​ క్లాస్ వ్యక్తే..

తెలంగాణ(Telangana) ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయిందా అని మండిపడ్డారు. నాడు సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిసినప్పుడు చిల్లర పార్టీ అనిపించలేదా అని ప్రశ్నించారు. ‘‘మీ కుటుంబం వెలిగిపోవడానికి కారణం కాంగ్రెస్‌ అని.. కాంగ్రెస్‌పై మాట్లాడిన కేటీఆర్(KTR) క్యారెక్టర్ లేనివాడు’ అని జగ్గారెడ్డి విమర్శించారు. సోనియాగాంధీతోనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే, కేసీఆర్(KCR)​ కూడా ఆ థర్డ్ క్లాస్‌ వ్యక్తే అన్నారు. కేటీఆర్‌కు రాజకీయ పరిపక్వత లేదని ఎద్దేవా చేశారు.

Jaggareddy | కాంగ్రెస్​ పెట్టిన భిక్ష

కేసీఆర్​ కుటుంబం ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతుందంటే.. కాంగ్రెస్​ పెట్టిన భిక్షేనని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్​ త్యాగాల పార్టీ అయితే.. కేసీఆర్​ కుటుంబానిది డ్రామాల పార్టీ అన్నారు. మంత్రులు సైతం కేటీఆర్​ వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్​ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఎటువంటిందో కేటీఆర్​ తన తండ్రి కేసీఆర్​ను అడగాలని హితవకు పలికారు.