అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం రాజకీయ దుమారం రేగుతోంది. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇటీవల కేటీఆర్ (KTR)ను విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీ అర్వింద్ (MP Arvind) స్పందించారు. కేటీఆర్, ఆయన కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వారికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఐదు రోజుల్లోగా స్పందించాలని నోటీసులు ఇచ్చారు. లేదంటే పరువునష్టం దావా (Defamation lawsuit) వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
KTR | ఏమన్నారంటే..
సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరిట కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ అర్వింద్ జగిత్యాలలో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై డ్రగ్స్ కేసు, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలన్నారు. డ్రగ్స్ తీసుకునే వారికి ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో.. కేటీఆర్‌కు అలాంటి వ్యక్తిత్వం ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వారికి లీగల్ నోటీసులు పంపించారు.