HomeతెలంగాణKTR comments | బాన్సువాడలో పోచారం ఓడిపోతారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KTR comments | బాన్సువాడలో పోచారం ఓడిపోతారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR comments | పాలన చేతకాని కాంగ్రెస్..​ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్​ చేశారు.

పలువురు కాంగ్రెస్​ నేతలు శుక్రవారం (సెప్టెంబరు 5) బీఆర్​ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడారు.

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పీకర్​కు సూచించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు స్పీకర్​ పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా అందజేశారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్​రెడ్డి (Pocharam Srinivas Reddy) అనంతరం కాంగ్రెస్​లో చేరారు.

పోచారం వ్యవసాయ సలహాదారు పదవి కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్​ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన స్థానాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR comments | మరోసారి కోర్టుకు వెళ్తాం

మూడు నెలల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్​ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్​ పేర్కొన్నారు.

పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 21 నెలల పాలనలోనే  ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం 21 నెలల్లోనే రూ. 2.20 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసిందన్నారు. హామీలు అమలు చేయడంతో విఫలమైన కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

KTR comments | అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్

ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, గత ప్రభుత్వం అప్పులు చేసిందని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని కేటీఆర్ మండిపడ్డారు.

బీఆర్​ఎస్​ హయాంలో రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసినట్లు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

21 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.2.20 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. ఆ అప్పులతో ఏ ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు.

Must Read
Related News