అక్షరటుడే, ఆర్మూర్ : KTR BRS Statement | బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తూ ఆర్మూర్‌లో (Armoor) ఆగారు.
KTR BRS Statement | రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
ఈ సందర్భంగా ఆర్మూర్‌లో ఆగిన కేటీఆర్‌ను (KTR) బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ (Tealangana) ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పెంచిన పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని అదే విధంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అందజేయాలని రైతులకు అడిగితే బీఆర్ఎస్ నాయకులను (BRS Ledaers) అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, పార్టీ కౌన్సిలర్లు గుంజులు పృథ్వి, నదీం, అజీం, సీనియర్ నాయకులు పోల సుధాకర్, మహేష్, ఎంజె రాము జనపల్లి రంజిత్, రోహిత్ ప్రవీణ్ గౌడ్, షరీఫ్ సత్తార్, ఇనేక్ ఫాల్ బబ్లు, మట్టెల ప్రవీణ్, మోహన్, జీజీ రామ్, మెట్టు సంతోష్, సుధాకర్, వేణు, కళ్యాణ్, ఇంతియాజ్ పాల్గొన్నారు.
