అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR attacks Congress Government | అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే, బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
భూపాలపల్లి (Bhupalpally)లో సోమవారం కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యాసంగి సీజన్ సగం పూర్తయినా.. రైతు బంధు ఇవ్వలేదన్నారు. ఈ అబద్ధాల, బూతుల ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్‌కు వెళ్లి ‘కారు’ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. 11వ తేదిన కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్లీ మోసం చేస్తారని చెప్పారు.
KTR attacks Congress Government | సింగరేణిలో దోపిడీ
సింగరేణి కాంట్రాక్టు (Singareni Contract)ల పేరుతో రేవంత్ రెడ్డి రూ.6 వేల కోట్ల దోపిడీ చేశారని కేటీఆర్ ఆరోపించారు. ‘సైట్ విజిట్’ నిబంధన పెట్టి టెండర్లను అడ్డుకుని, తన బావమరిదికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్నారు. కొత్తగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసి,అన్ని రకాలుగా కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భూపాలపల్లి జిల్లాను తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. భూపాలపల్లి జిల్లాను తీసేస్తే.. ఇక్కడి జనమే వీపు చింతపండు చేస్తారన్నారు. కేసీఆర్ (KCR)ను తిడితే మాత్రం రేవంత్‌రెడ్డిని వదిలి పెట్టేది లేదన్నారు. ఈ సందర్భంగా సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డికి రెండేళ్ల టైం ఉందన్నారు. అనంతరం ఆయన పాతాళంలో దాక్కున్న వదిలిపెట్టామని సంచలన వ్యాఖ్యలు చేశారు.