ePaper
More
    HomeతెలంగాణFormer MLA Prabhakar | పార్టీ పగ్గాల కోసం పోటీ పడుతున్న కేటీఆర్​, కవిత

    Former MLA Prabhakar | పార్టీ పగ్గాల కోసం పోటీ పడుతున్న కేటీఆర్​, కవిత

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Former MLA Prabhakar | బీఆర్​ఎస్​ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్​(KTR), కవిత(Kavitha) తీవ్రంగా పోటీ పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే(Former MLA), బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్(NVSS Prabhakar) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్(KCR)​ కుటుంబం కోసమే వరంగల్ సభ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ కేవలం కేటీఆర్.. కవిత కోసమే పనిచేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు.

    లిక్కర్​ స్కాం(Liquor scam)లో జైలుకు వెళ్లిన కవిత.. ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ప్రస్తుతం వరంగల్ లో నిర్వహిస్తున్న సభ ఎవరికోసమో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) కు ఇవి చివరి రోజులన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, శ్రీకాంత్, విజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...