అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR on Hung Municipalities | హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ఆదివారం సేవాలాల్ (Sevalal) జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 34 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చిందన్నారు. అక్కడ తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోయి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను, గూండాలను ఇళ్లపైకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 17 మున్సిపాలిటీలను దక్కించుకున్నామని ఆయన తెలిపారు. హంగ్ మున్సిపాలిటీల్లో 10 వరకు బీఆర్ఎస్కు రావొచ్చని ఆయన పేర్కొన్నారు.
KTR on Hung Municipalities | తండాలను జీపీలు చేశాం
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి తలరాతను మార్చి, గిరిజనులను స్వయం పాలకులుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో 4.50 లక్షల ఎకరాల పోడు పట్టాలు అందించామన్నారు. బంజారాహిల్స్‌లో బంజారా భవన్ (Banjara Bhavan)ను నిర్మించామన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతుగా నిలవాలంటూ బంజారాలను ఆయన కోరారు.
KTR on Hung Municipalities | అవినీతిపై పోరాటం
కాంగ్రెస్, సీపీఐ అలయన్స్‌లో ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అయితే సింగరేణిలో దోపిడీని అరికట్టడానికి తాము సీపీఐకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సీపీఐపైన ఒత్తిళ్లు రావడంతో కొత్తగూడెంలో కాంగ్రెస్‌తో పొత్తుకు ఒప్పుకుందన్నారు. ఎవరు కలిసి వచ్చినా.. రాకున్నా.. సింగరేణి అవినీతిపై పోరాటం తాము పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.