ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​GGH Superintendent | జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా కృష్ణ మాలకొండ రెడ్డి

    GGH Superintendent | జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా కృష్ణ మాలకొండ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: GGH Superintendent | నిజామాబాద్​ జిల్లా జనరల్​ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్​గా డాక్టర్​ పి కృష్ణ మాలకొండ రెడ్డి (Krishna Malakonda Reddy) నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్​ చోంగ్తూ (Christina Z. Chongtu) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్​ జీజీహెచ్​ సూపరింటెండెంట్​ను, వైద్య కాలేజీకి ప్రిన్సిపాల్​ను నియమించారు.

    గతంలో జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా ప్రతిమారాజ్​ కొనసాగారు. ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో జనవరిలో ఆమెను ప్రభుత్వం తొలగించింది. సూపరింటెండెంట్​ బాధ్యతలు డాక్టర్​ శ్రీనివాస్​కు అప్పగించింది. తాజాగా ఉస్మానియా మెడికల్ (OMC)​ కాలేజీలో కార్డియాలజీ ప్రొఫెసర్​గా పని చేస్తున్న కృష్ణ మాలకొండ రెడ్డిని జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా నియమించింది.

    GGH Superintendent | వైద్య కాలేజీ ప్రిన్సిపాల్​గా కృష్ణమోహన్​

    నిజామాబాద్​ ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రిన్సిపాల్​ (Medical College Principal)గా కృష్ణమోహన్​ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్​గా పని చేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్​ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​గా డాక్టర్​ శివప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కృష్ణమోహన్​ తర్వలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...