Homeక్రీడలుKranti Goud | ప్రపంచకప్ విజయంతో తండ్రికి తిరిగి ఉద్యోగం.. క్రాంతి గౌడ్ కథ దేశానికే...

Kranti Goud | ప్రపంచకప్ విజయంతో తండ్రికి తిరిగి ఉద్యోగం.. క్రాంతి గౌడ్ కథ దేశానికే స్ఫూర్తి!

Kranti Goud | క్రాంతి కథ ఇప్పుడు కేవలం విజయగాథ కాదు.. కష్టం, పట్టుదలతో కుటుంబ గౌరవం తిరిగి తీసుకొచ్చిన స్ఫూర్తిదాయక యాత్రగా దేశం అంతా గర్వపడేలా చేస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kranti Goud | మహిళా వన్డే ప్రపంచకప్‌ Women World Cup లో అద్భుత ప్రదర్శనతో Bharat జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ పేసర్ క్రాంతి గౌడ్ ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగేలా చేసింది.

ఆమె ప్రతిభ కేవలం భారత జట్టుకు గెలుపునే కాకుండా, తన కుటుంబానికి కూడా ఒక కొత్త ఆశను తెచ్చింది. ప్రపంచకప్ విజయంతో, 13 సంవత్సరాల క్రితం ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నా సింగ్ గౌడ్ Munna Singh Goud మళ్లీ పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరబోతున్నారు.

మధ్యప్రదేశ్‌ Madhya Pradesh కు చెందిన క్రాంతి గౌడ్‌ను భోపాల్‌ Bhopal లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ Chief Minister Mohan Yadav ఘనంగా సన్మానించారు.

Kranti Goud | సీఎం హామి

ఈ కార్యక్రమంలో ఆమె కోచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “క్రాంతి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణం. ఆమె సాధనతో కేవలం క్రీడలోనే కాదు, తన తండ్రికి గౌరవాన్ని కూడా తిరిగి తెచ్చింది..” అని అన్నారు.

అలాగే, 2012లో ఎలక్షన్ డ్యూటీ సమయంలో జరిగిన ఒక ఘటన కారణంగా సస్పెండ్ అయిన క్రాంతి తండ్రి మున్నా సింగ్ గౌడ్‌ను మళ్లీ పోలీస్ కానిస్టేబుల్‌గా పునరుద్ధరిస్తామని సీఎం ప్రకటించారు.

తండ్రి ఉద్యోగం పోయిన తర్వాత తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని క్రాంతి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

“కొన్ని రోజులు పూట గడవడానికి కూడా కష్టపడ్డాం. నా తల్లిదండ్రుల కష్టాలు నా కళ్ల ముందే చూశా. ఒక రోజు నా తండ్రి మళ్లీ పోలీస్ యూనిఫాంలో కనిపించాలని నా కల..” అని భావోద్వేగంగా వెల్లడించింది.

ప్రపంచకప్‌లో క్రాంతి గౌడ్ అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి జట్టు విజయానికి బలమైన తోడ్పాటు అందించింది.

ఆమె ప్రదర్శనతో భారత్ ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, కుటుంబ గౌరవాన్ని కూడా తిరిగి తెచ్చుకుంది.

Kranti Goud | రూ. కోటి నజరానా

క్రాంతి కృషిని గుర్తిస్తూ సీఎం మోహన్ యాదవ్ ఆమెకు ₹1 కోటి నజరానా ప్రకటించారు. ఈ వేడుకలో క్రీడలు, యువజన సంక్షేమ మంత్రి విశ్వాస్ సారంగ్, క్రాంతి తల్లిదండ్రులు, కోచ్‌లు కూడా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, నవంబర్ 15న గిరిజన ఐకాన్, స్వాతంత్య్ర‌ సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జబల్‌పూర్‌లో క్రాంతి గౌడ్‌ను మరోసారి సత్కరించనున్నారు.

Must Read
Related News