అక్షరటుడే, కోటగిరి : Kotagiri | కోటగిరి మండలం సుద్దులంలో గడ్డివాము(haystack) కాలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పు పెట్టడంతో దాదాపుగా 500 గడ్డిమోపులు కాలిపోయాయని బాధితుడు తోట శివకుమార్ తెలిపాడు. మంటలు పక్కనే ఉన్న గేదెల పాక వరకు వ్యాపించాయి. అయితే స్థానికులు స్పందించి గేదెలను వదిలేయడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.
