అక్షరటుడే, కోటగిరి: Kotagiri | రౌడీ షీటర్లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పటేల్ ప్రసాద్ (Patel prasad) డిమాండ్ చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో రౌడీమూకలు నగరంలో పేట్రేగిపోతున్నారన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ.. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గురువారం (అక్టోబరు 23) కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
గ్రామంలోని హనుమాన్ మందిరం నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో రౌడీమూకలు పేట్రేగిపోతున్నారన్నారు.
రియాజ్ లాంటి అనేక మంది రౌడీ షీటర్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Kotagiri | కాల్పుల నిందితుడికి సరైన శిక్ష విధించాలి..
మేడ్చల్(Medchal) జిల్లాలో గోరక్షక్పై కాల్పులు జరిపిన గుండాకు సరైన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్, నాయకులు గాండ్ల శ్రీనివాస్, సతీష్, అరవింద్, డాన్ రాజు, మామిడి శ్రీనివాస్, హన్మంత్ రావు, శ్రీకాంత్, గంగాధర్, శివశంకర్, హంగర్గ శ్రీకాంత్, నాగెల్లి శ్రీనివాస్, సంతోష్, దుబాస్ మహేష్, మహేష్ రెడ్డి, చిత్తరి సంజు, యాదు, గంగా ప్రసాద్ గౌడ్, రోషన్, నీలి శంకర్, హస్కుల శ్రీకాంత్, దినేష్, నగేష్, రమేష్, కప్ప సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
