అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kota Srinivasa rao : తెలుగు సినిమా తెర Telugu cinema screen పై నటనకి జీవం పోసి నవరస నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు. విలక్షణ డైలాగ్ డెలివరీ, పాత్రలో లీనమై నటించే శైలి ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి.
కోట శ్రీనివాసరావు గారు 1947, జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు, ఒక ప్రముఖ వైద్యుడు. చిన్నప్పటి నుంచే నాటకాలపై కోటకు ఆసక్తి ఉండేది. సినిమా రంగంలోకి రాకముందు, స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసేవారు.
అయితే, నాటకాల మీద ఉన్న ప్రేమతో పరిషత్తు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంటూ ఉండేవారు. నాటకాల అనుభవం వల్లనే ఆయన డైలాగ్ మాడ్యులేషన్‌కు ఓ ప్రత్యేకమైన ఒరవడి ఏర్పడింది.
Kota Srinivasa rao : కూలిన కోట..
1978–79లో ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకంలో నటిస్తున్న కోట గారిని దర్శకుడు క్రాంతికుమార్ చూసి ఆ నాటకాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించగా, అదే చిత్రం ద్వారా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేశారు.
తర్వాత 1985లో ‘ప్రతిఘటన’ చిత్రంలో గుడిశెల కాశయ్య పాత్ర ద్వారా తెలంగాణ యాసతో తెరపై జీవించించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోట దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించి, ప్రతీ పాత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు.
ఆయన్ను ఒక “హీరో”గా చూడలేకపోయినా, విలన్‌గా, కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని పాత్రలలో నటించి మెప్పించారు. కోట యమలీల చిత్రంలో మాంత్రికుడిగా వినూత్నమైన హావభావాలు ప్రదర్శించారు. గాయం చిత్రంలో పొలిటికల్ గూండాగా అదరగొట్టారు.
అహ నా పెళ్లంట – పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్రలో నవ్వులు పూయించారు. మనీ – “బీ కేర్‌ఫుల్ బ్రదరూ!” అంటూ అదరగొట్టారు. సర్కార్ (హిందీ) – అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం దక్కింది. అయితే కోట ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “నాకు ఎందరో గొప్ప నటులతో కలిసి నటించే అవకాశం వచ్చింది.
కానీ, ఎన్టీఆర్ గారితో మాత్రం కలిసి నటించలేకపోయాను. ఒకసారి అవకాశం వచ్చినా, డేట్స్ కుదరలేదు. అదే నా జీవితంలో చిన్న లోటు అని బాధపడ్డారు. కోట ఎప్పుడూ హీరోగా మారాలనే ఆశ పెట్టుకోలేదు. “నేను దర్శకుడైనా, నిర్మాతైనా అయ్యుంటే నా మీదే ప్రశ్నలు వేసేవారు. కానీ, నాకు పాత్రలంటే మక్కువ. నా పాత్రలో లీనమై నటించగలగడమే నాకు ముఖ్యమని ఆయన ఓ సందర్భంలో చెప్పారు.
తెలంగాణ యాస Telangana accent, తెలుగు సంప్రదాయాలు Telugu traditions, రాజకీయ కోణం political angle, కామెడీ హావభావాలు ఇలా అన్ని పాత్రలో జీవించగల నటుడు కోట శ్రీనివాసరావు మాత్రమే. కోట కేవలం నటించటం కాదు.. ఆ పాత్రలో జీవించేవారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఓ సువర్ణాధ్యాయం. ఆయనది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. ఎన్టీఆర్, అక్కినేని తరం హీరోల నుంచి ఈ తరం యువ కథానాయకుల వరకు అందరితోనూ కలిసి నటించిన ఆయన తనదైన విలక్షణ నటనతో ఎంతగానో మెప్పించారు. 83 ఏళ్ల వయస్సులో కోట అనారోగ్యంతో కన్నుమూయడం ప్రతి ఒక్కరిని బాధిస్తోంది.
కోట నటుడిగా మాత్రమే కాదు…. రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవ చేశారు. భారతీయ జనతా పార్టీలో కొన్నేళ్లు కొనసాగిన ఆయన, విజయవాడ తూర్పు నియోజకవర్గం Vijayawada East constituency నుంచి 1999లో ఎమ్మెల్యే MLA గా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.