Homeజిల్లాలుకామారెడ్డిKOS Nizamabad student SSC State Topper | టెన్త్​ ఫలితాల్లో కేవోఎస్​ విద్యార్థినికి స్టేట్​...

KOS Nizamabad student SSC State Topper | టెన్త్​ ఫలితాల్లో కేవోఎస్​ విద్యార్థినికి స్టేట్​ ఫస్ట్​ ర్యాంక్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: పదో తరగతి ఫలితాల్లో కాకతీయ ఒలంపియాడ్​ స్కూల్​(కేవోస్​) kos nizamabad విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారు. పాఠశాలకు చెందిన ఎస్.కృతి 596 ssc topper kruthi మార్కులతో స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించినట్లు ఛైర్​పర్సన్​ విజయలక్ష్మి ch. Vijaya Lakshmi kakatiya nizamabad chairperson తెలిపారు.

KOS Nizamabad | 596 మార్కులతో స్టేట్​ ఫస్ట్

కేవోఎస్​ విద్యార్థిని కృతి ​పదో తరగతి ఫలితాల్లో 596 మార్కులు సాధించి స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు కైవసం చేసుకుంది. హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు శాతం గ్రేడ్​ పాయింట్లు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాకతీయ యాజమాన్యం అభినందించింది.

రాష్ట్రస్థాయిలో ఫస్ట్​ ర్యాంకు సాధించి విద్యాసంస్థకే కాకుండా జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిందని డైరెక్టర్లు రామోజీరావు, తేజస్విని, రాజా కొనియాడారు. అనంతరం విద్యార్థిని కృతి మాట్లాడుతూ.. కేవోఎస్​లో kos school అందించిన ఉత్తమ విద్యతోనే తాను స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించగలగానని తెలిపింది. ప్రతి సబ్జెక్టులో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని వివరించింది. డైరెక్టర్లు రామోజీ iiitian ramoji, తేజశ్విని director Tejaswini ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి విద్యార్థి రాణించేలా వెన్నంటి ప్రోత్సహించారని తెలిపింది. అంతేకాకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పింది. అందరి కృషి వల్లే తాను మొదటి ర్యాంకు సాధించినట్లు వెల్లడించింది.

KOS Nizamabad | రాష్ట్రస్థాయిలో కేవోస్​కు మరిన్ని ర్యాంకులు

కేవోస్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మరిన్ని ర్యాంకులు సాధించారు. నితీష్ (591 మార్కులు), ఎస్ఎన్వి.అఖిల్ (590), డి.కృతి( 587), సాయి శ్రేయస్, వర్షిని(586), ఆదిబా సిద్ధికి, గౌతం (585), జశ్వంత్ (584), అస్త గౌర్ (583), భవాని, యోచన (582) మార్కులతో రాష్ట్ర స్థాయిలో మెరిశారు. ఈ సందర్భంగా వీరిని కాకతీయ యాజమాన్యం అభినందించింది.